Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Friday, February 25, 2011

" ఎ.పి.ఎస్.ఆర్.టి.సి " పై - స.హ చట్టం ఆధారంగా దరఖాస్తులు - ప్రతిస్పందనలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రజానీకం ఉపయోగించే ప్రయాణ మాధ్యమం " ఎ.పి.ఎస్.ఆర్.టి.సీ  ". ప్రతి నిత్యం మనం సంస్థ పని తీరుని విమర్శించే వారినీ, తప్పని సరి పరిస్థితుల్లో, అసంతృప్తితో వారి సేవలను వాడుకునే వారినీ, చూస్తూనే ఉంటాము. అయితే, సంస్థ పని తీరును ప్రశ్నించే అవకాశం మనకే వస్తే ? మన సలహాలనూ, సూచనలనూ అందజేస్తూ, సవాళ్ళకు సరైన సమాధానం అందివమ్మని అడగగల హక్కులు మన చేతిలో ఉంటే?

 ఆర్.టి.ఐ (సమాచార హక్కు చట్టం) ఆధారంగా ఈ విషయంలో చేయబడిన కృషికి, " సత్య విశ్వేశ్వర రావు" గారు అందించిన అక్షర రూపం, మీ అందరి కోసం :

సమస్య ఏమిటి?

సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో పెరుగుతున్న సమస్యల కారణంగా ప్రయాణీకులకు వివిధ రకాలైన సమస్యలు ఎదురౌతున్నాయి. ఇందులో ప్రధానమైన సమస్యలు ఏమిటంటే, ప్రయాణ ప్రాంగణాలలో బస్సు రూట్ల గురించి, బస్సు వేళల గురించి సమాచారం లేకపోవడం, బస్సులకు కనీస ధారుడ్య ప్రమాణాలు
(ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ) లేకపోవడం, సంస్థ సిబ్బంది కి గుర్తింపు కార్డులు లేకపోవడం, బస్సులలో పరిశుభ్రత లేమి మొదలైనవి.

Friday, February 18, 2011

జేపీకి తగిలిన దెబ్బ గుర్తుంచుకోవాలె

*** నిన్నటి అసెంబ్లీ ఆవరణలో అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించదగ్గ సంఘటనకు, మన లాంటి ఎందరిలోనో పోటెత్తిన ఆవేశం, సందీప్ కలంలో నుండి, దుఖాఃశ్రువులుగా, ఇలా...*****


గుర్తుంచుకోవాలె

జేపీకి తగిలిన దెబ్బ

మనం గుర్తుంచుకోవాలె

నిజాయితీకి జరిగిన అవమానం

ప్రజా స్వామ్యాన్ని చేసిన అపహాస్యం

గుర్తుంచుకోవాలె

పిరికిపందల ముసుగుచాటు దాడిని

వన్ మ్యాన్ ఆర్మీ అంటూ చేసిన ఎగతాళిని

గుర్తుంచుకోవాలె

ఈ రోజు వచ్చిన ఆవేశం దాచుకోవాలె

ఒక రోజు ఆ వన్ మ్యాన్ ఎన్కున్న ఆర్మీ సత్తా చూపెట్టాలని పగవట్టాలె

అట్లయినంకనే కసి తీరాలె, విశ్రాంతి కోరాలె, నిద్ర పోవాలె

గుర్తుంచుకోవాలె

అబ్బా! జేపీకి తగిలిన దెబ్బ

మనం గుర్తుంచుకోవాలె



రచన: సందీప్ పట్టెం

Friday, January 21, 2011

లోక్ సత్తా టైమ్స్ పత్రికలో " సంజీవని - సెక్షన్ 4(1)(బి) "

సెక్షన్ 4(1)(బి) మీద సంజీవని మ్రోగించిన యుద్ధ భేరి తాలూకు వివరాలను, లోక్ సత్తా టైమ్స్ పక్ష పత్రిక, తన జనవరి సంచికలో ( 23, 24 పేజీల్లో) ప్రచురించింది.

దాని లంకె, ఇదుగో ఈ కింద :
http://www.loksatta.org/cms/documents/lstimes/2011jan1.pdf

Wednesday, January 19, 2011

సమాచార హక్కు చట్టంతో సామాన్యుని విజయం

సంజీవని చేపడుతున్న కార్యక్రమాల ద్వారా సమాచార హక్కు చట్టం యొక్క ఆవశ్యకతను తెలుసుకున్న ప్రజలు వారి అనుభవాలను తెలియజేస్తూ, మాకు పంపే లేఖలు, సంక్షిప్త సమాచారాలు చదువుతుంటే మా కార్యకర్తల శ్రమకి చక్కని ప్రతిఫలమే దొరుకుతూందనిపిస్తుంది. అంతకన్నా ముఖ్యంగా, ప్రజలకు ఈ చట్టం ద్వారా కలిగే ఈ ఉపశమనమే, సంజీవని బృందానికంతటికీ నిజమైన స్ఫూర్తి.

Sunday, December 19, 2010

సెక్షన్ 4(1)(బి) మీద సంజీవని యుద్ధభేరి!!


లోక్ సత్తా సంజీవని..!
అవినీతికీ అన్యాయానికి తావు లేని ఒక కొత్త లోకాన్ని సృష్టించేందుకు నడుం బిగించి ముందుకు వచ్చిన చైతన్య స్రవంతి సంజీవని! అవినీతి రక్కసి కోరల్లో చిక్కుకుని ఊపిరాడక ఆఖరి దశకు చేరుకోనున్న స్వతంత్ర భారతావనికి , ముప్పు తప్పించేందుకు ముందుకు వచ్చిన ఈ ' సంజీవని ' - లోక్ సత్తా అనుబంధ సంస్థ. ప్రజలే పెంచి పోషించిన బద్ధకానికీ, నిర్లక్ష్యానికీ అలవాటు పడి, పని చెయ్యడానికి పూర్తిగా నీళ్ళు వదిలిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దుమ్ము దులిపేందుకు ముందడుగు వేసారీ సంజీవని సూత్రధారులు.


సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి ఐదు వసంతాలు పూర్తి అయిన శుభ తరుణంలో, హక్కు మనకు అందించ దలచిన ఫలాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఏదైనా వినూత్నంగా చెయ్యాలన్న లోక్ సత్తా సంజీవని సూత్రధారుల తలపుల్లో నుండి,తపనలో నుండి పుట్టినదే ఈ 'సెక్షన్ 4(1)(బి) పై యుద్ధభేరి ' ఘట్టం. అందులో భాగంగా, ఒకటో రెండో కాదు..పదులూ ఇరవైలూ కాదు..ఏకంగా 500 ఆర్.టి.ఐ  దరఖాస్తులు, ఒకే సెక్షన్ [ 4(1)(బి)] మీద పెట్టి, ఒక చరిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు సంజీవని సభ్యులు. ఈ దరఖాస్తులలో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు మరియు సచివాలయంలోని వివిధ విభాగాల ప్రథాన కార్యదర్శులకు, మిగిలినవి రంగారెడ్డి, నల్గొండ మరియు హైదరాబాదు జిల్లాల కార్యాలయాలకు ఉద్దేశింపబడినవి. దరఖాస్తులకు వచ్చిన సమాధానాలు స్వల్పంగాను, అసంతృప్తికరంగాను ఉండటంతో సంజీవని బృంద సభ్యులు 350 ఫిర్యాదులు దాఖలు చేసారు.

శాఖలు, కార్యాలయాలు పంపిన సమాధానాల గణాంకాలతో కూడిన వివరాలు క్రింద చూడగలరు.