ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రజానీకం ఉపయోగించే ప్రయాణ మాధ్యమం " ఎ.పి.ఎస్.ఆర్.టి.సీ ". ప్రతి నిత్యం మనం సంస్థ పని తీరుని విమర్శించే వారినీ, తప్పని సరి పరిస్థితుల్లో, అసంతృప్తితో వారి సేవలను వాడుకునే వారినీ, చూస్తూనే ఉంటాము. అయితే, సంస్థ పని తీరును ప్రశ్నించే అవకాశం మనకే వస్తే ? మన సలహాలనూ, సూచనలనూ అందజేస్తూ, సవాళ్ళకు సరైన సమాధానం అందివమ్మని అడగగల హక్కులు మన చేతిలో ఉంటే?
ఆర్.టి.ఐ (సమాచార హక్కు చట్టం) ఆధారంగా ఈ విషయంలో చేయబడిన కృషికి, " సత్య విశ్వేశ్వర రావు" గారు అందించిన అక్షర రూపం, మీ అందరి కోసం :
సమస్య ఏమిటి?
సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో పెరుగుతున్న సమస్యల కారణంగా ప్రయాణీకులకు వివిధ రకాలైన సమస్యలు ఎదురౌతున్నాయి. ఇందులో ప్రధానమైన సమస్యలు ఏమిటంటే, ప్రయాణ ప్రాంగణాలలో బస్సు రూట్ల గురించి, బస్సు వేళల గురించి సమాచారం లేకపోవడం, బస్సులకు కనీస ధారుడ్య ప్రమాణాలు
(ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ) లేకపోవడం, సంస్థ సిబ్బంది కి గుర్తింపు కార్డులు లేకపోవడం, బస్సులలో పరిశుభ్రత లేమి మొదలైనవి.