Wednesday, January 19, 2011

సమాచార హక్కు చట్టంతో సామాన్యుని విజయం

సంజీవని చేపడుతున్న కార్యక్రమాల ద్వారా సమాచార హక్కు చట్టం యొక్క ఆవశ్యకతను తెలుసుకున్న ప్రజలు వారి అనుభవాలను తెలియజేస్తూ, మాకు పంపే లేఖలు, సంక్షిప్త సమాచారాలు చదువుతుంటే మా కార్యకర్తల శ్రమకి చక్కని ప్రతిఫలమే దొరుకుతూందనిపిస్తుంది. అంతకన్నా ముఖ్యంగా, ప్రజలకు ఈ చట్టం ద్వారా కలిగే ఈ ఉపశమనమే, సంజీవని బృందానికంతటికీ నిజమైన స్ఫూర్తి.

ఈ చట్టం నిజంగా ఎంత ఉపయోగ పడుతుందో ఇటీవల మాకు వచ్చిన ఈ క్రింది సందేశం తెలుపుతుంది. ఈ విజయం సమాచార హక్కు చట్టం యొక్క ఆవశ్యకతను చాటేందుకు ఓ మచ్చు తునక. సంజీవని సాగిస్తున్న సమాచార హక్కు చట్ట వినియోగపు విజయపరంపరలో మరో కలికితురాయి. అనతికాలంలోనే ఈ చట్టం ప్రజలు వాడే అతి సామాన్య సాధనంలా మారుతుందనడంలో అతిశయోక్తి లేదేమో అనిపిస్తుంది.

శ్రీ చంద్రశేఖర్ గారు (అడ్మిన్, బజాజ్ అలయన్స్, పశ్చిమ ఆంధ్రప్రదేశ్), బిపిసియల్ నుండి వంట గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు. ఖాళీ అయిన గ్యాస్ సిలిండర్ మార్పిడికి అర్జీ పెట్టుకున్న ప్రతీసారీ, డీలర్ వారికి మార్పించుకున్న 21 రోజుల తర్వాతే కొత్త అర్జీ చెల్లుతుందనీ, అర్జీ దాఖలు పరిచిన 14 రోజులలోపు సిలిండర్ మారుస్తారనీ వివరించారు. నవంబర్ 7, 2010 న వారు సిలిండర్ మార్పిడికి అర్జీ దాఖలు చేయగా 24వ తారీఖు వరకు కొత్త సిలిండర్ రాలేదు. ఎన్నోసార్లు అడిగినా, ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో, వారు సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకుని, దాని ద్వారా సమస్యని పరిష్కరించదలచారు.

బిపిసియల్ ముఖ్యకార్యాలయానికి, ఫోన్ చేసి వారి సమస్యని విన్నవించి, త్వరగా పరిష్కరించవలసిందిగా కోరారు. లేనియడల సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. మరో 5నిమిషాల్లో, డీలర్ నుంది వారికి ఫోన్ రావడం, 45 నిమిషాల్లో సిలిండర్ వారికి జారీ చేయడం జరిగిపోయాయి.
13 కిలో మీటర్ల దూరంలో ఉండే డీలర్ కార్యాలయము నుండి, 45 నిముషాల వ్యవధిలో సిలిండెర్ రావడాన్ని బట్టి, ఉద్యోగులు దాదాపు ఫిర్యాదు అందిన మరు క్షణమే ప్రతిస్పందించి ఉంటారని, శేఖర్ భావిస్తున్నారు.

తరువాత వారికి బిపిసియల్ ముఖ్యకార్యాలయం నుండి ఫోన్లో, డీలర్ యొక్క సేవలు, నాణ్యత గురించి వాకబు చేయడం జరిగింది. స్వయాన బిపిసియల్ మేనేజర్ వారితో, కొత్త సిలిండర్ అర్జీ, సిలిండర్ జారీ చేసిన 48గంటల తర్వాత స్వీకరిస్తారనీ, స్వీకరించిన 24గంటలలోపు జారీ చేస్తారనీ, అంతేగాక మునుముందు ఏమైనా సమస్యలు ఉంటే తనని స్వయంగా సంప్రదించవచ్చనీ, సరైన సమాధానం తెలిపే పూచీ తనదని తెలియజేసారు.

శ్రీ చంద్రశేఖర్ గారు ఈ చట్టం వల్ల వారికి కొత్త సిలిండర్ పొందే సరైన విధానమే కాక ఎలాంటి సమస్యకైనా కంపెనీ నుండి పరిష్కారం పొందే హామీ దొరికిందనీ సంతోషం వ్యక్తం చేశారు. వారు సమాచార హక్కు చట్టం సామాన్యుల పాలిట ఒక వరమని, వారికి అది ఒక అస్త్రంలా పని చేస్తుందని, దానిని వారికి తెలియజేసిన సంజీవని కార్యకర్తలు శ్రీ అబ్దుల్ అజీజ్ మరియు, గంజి శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

రచనా సహకారం : హేమంత్ కుమార్ లక్కరాజు

For English version of the same article, please refer http://www.loksattasanjeevani.in/2011/01/gas-refilling-issues-knowledge-of-rti.html

4 comments:

  1. మీరు లోక్ సత్తా అనుబంధ సంస్థా? మీ కర్యకలాపాలు ఆసక్తి కరం గా ఉన్నాయి.
    All the best to all of you.

    ReplyDelete
  2. శ్రేయ గారూ,

    కృతజ్ఞతలు. సంజీవని, ఆంధ్ర ప్రదేశ్ లో సహకార చట్టం పూర్తి స్థాయి అమలుకి కృషి చేస్తున్న బృందం. లోక్ సత్తా కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.

    ReplyDelete
  3. Rti waste
    My case number 10292/CIc/2017
    No Justice in my case
    Only fake media advaticement

    ReplyDelete